శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Sep 18, 2020 , 15:26:00

అర్హులందరికి డబుల్ బెడ్ రూం ఇండ్లు : మంత్రి శ్రీనివాస్ గౌడ్

అర్హులందరికి డబుల్ బెడ్ రూం ఇండ్లు : మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ : అర్హులైన పేదలకు ఉచితంగా డబుల్ బెడ్ రూం ఇండ్లను అందజేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లాలోని ఏనుగొండ మౌలాలి గుట్ట వద్ద  రూ. 31 కోట్ల 16 లక్షల  వ్యయంతో నిర్మించనున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి పేదవాడికి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఉచితంగా అందజేస్తామన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్ రావు, చైర్మన్ కేసీ నర్సింహులు, డీసీసీబీ వైస్ చైర్మన్ కోరమోని వెంకటయ్య, తాటి గణేష్, కౌన్సిలర్లు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.logo