మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 08, 2020 , 00:45:55

ఆడబిడ్డకు ఆత్మగౌరవం స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి

ఆడబిడ్డకు ఆత్మగౌరవం స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి

కోటగిరి: పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవం కాపాడటానికే డబుల్‌ బెడ్రూం ఇండ్లు నిర్మిం చి ఇస్తున్నామని స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండలం హంగర్గాలో నిర్మించిన 30 ఇండ్ల ను స్పీకర్‌ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. దేశం లో ఎక్కడాలేనివిధంగా రాష్ట్రంలో పేదల కోసం ఉచితంగా డబుల్‌ బెడ్రూం ఇండ్లు ని ర్మించి ఇస్తున్నామన్నారు. బాన్సువాడ నియోజక వర్గంలోని 106 గ్రామాల్లో రూ.500 కోట్లతో 5 వేల ఇండ్లు నిర్మిస్తున్నామన్నారు. logo