గురువారం 09 జూలై 2020
Telangana - Jun 21, 2020 , 01:45:34

తోడుగా నిలిచి.. గూడు కట్టించి

తోడుగా నిలిచి.. గూడు కట్టించి

  • నిరుపేదకు డబుల్‌ బెడ్రూం
  • చేయూతనందించిన ట్రాన్స్‌కో సీఎండీ 
  • గృహప్రవేశం చేసిన నిరుపేద రోమన్‌ 

హైదరాబాద్‌/సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ: దాతృత్వాన్ని ప్రదర్శించి ఆదుకోవడంలో ముందుండే టీఎస్‌ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ఓ నిరుపేదకు అండగా నిలిచారు. పూరిగుడిసె దగ్ధమై నిలువ నీడ కోల్పోయిన అభాగ్యుడికి గూడును కట్టించి గృహప్రవేశం చేయించారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందించి డబుల్‌ బెడ్రూం ఇంటిని నిర్మించి ఇవ్వగా.. బాధితుడి కుటుంబం శనివారం గృహప్రవేశం చేసింది. 

నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఇండ్లూరు గ్రామానికి చెందిన ఏపూరి రోమన్‌ పూరిగుడిసె గత ఏప్రిల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. గుడిసెతోపాటు రూ.57 వేల నగదు, అరతులం బంగారం, బైక్‌ కాలిబూడిదయ్యాయి. రోమన్‌ను ఆదుకునేందుకు పలువురు ముందుకురాగా.. ‘పల్లెవించిన మానవత్వం’ శీర్షికతో నమస్తే తెలంగాణ మెయిన్‌ పేజీలో వార్త ప్రచురితమైంది. దీన్ని చూసి ప్రభాకర్‌రావు చలించిపోయారు. సొం తింటిని నిర్మించి ఇచ్చేందుకు ముందుకొచ్చారు. డబుల్‌ బెడ్రూం ఇంటిని నిర్మించారు. ప్రభాకర్‌రావు సార్‌ దేవుడిలా ఆదుకున్నారని, ఆయనకు రుణపడి ఉంటామని రోమన్‌ చెప్పారు.


logo