గురువారం 02 జూలై 2020
Telangana - Jun 13, 2020 , 11:21:55

ఎరుకల నాంచారమ్మనగర్‌లో 'డబుల్'‌ ఇళ్లు ప్రారంభం

ఎరుకల నాంచారమ్మనగర్‌లో 'డబుల్'‌ ఇళ్లు ప్రారంభం

హైదరాబాద్‌ : నగరంలోని ఎల్బీనగర్‌ నియోజకవర్గం నాగోల్‌ డివిజన్‌ పరిధిలో గల ఎరుకల నాంచారమ్మ నగర్‌లో ప్రభుత్వం నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, చామకూర మల్లారెడ్డి నేడు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం పాల్గొన్నారు. సుమారు రూ. 25 కోట్ల వ్యయంతో నిర్మించిన 288 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను మంత్రులు నేడు ప్రారంభించి లబ్దిదారులకు అందజేశారు. 

రెండు బ్లాకులు.. 9 ఫ్లోర్లతో..

ఎరుకల నాంచారమ్మనగర్‌తో పాటు వనస్థలిపురం రైతుబజార్‌ వద్ద, హయత్‌నగర్‌లోనూ డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఎరుకల నాంచారమ్మనగర్‌లో ఇండ్ల నిర్మాణం పూర్తికావడంతో నేడు ప్రారంభించారు. ఇక్కడ రూ. 25 కోట్ల వ్యయంతో ఎకరం 34 గుంటల స్థలంలో 9 ఫ్లోర్లతో సర్వాంగ సుందరంగా 288 ఫ్లాట్లను నిర్మించారు. రెండు బ్లాక్‌లతో ఒక బ్లాక్‌లో 72, మరో బ్లాక్‌లో 216 ఫ్లాట్లు ఉన్నాయి. 

logo