శనివారం 06 జూన్ 2020
Telangana - May 21, 2020 , 20:44:25

జూన్‌ రెండోవారంలో ‘దోస్త్‌'!

జూన్‌ రెండోవారంలో ‘దోస్త్‌'!

హైదరాబాద్: ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు వచ్చిన వెంటనే డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను మొదలుపెట్టేందుకు తెలంగాణ ఉన్నత విద్యాశాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. జూన్‌ రెండోవారంలో షెడ్యూల్‌ జారీకి ప్రణాళికలు సిద్ధంచేస్తున్నారు. అందుకనుగుణంగా డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీస్‌ తెలంగాణ (దోస్త్‌)- 2020 నోటిఫికేషన్‌ విడుదలచేయనున్నారు. 

కరోనా నేపథ్యంలో డిగ్రీ ప్రవేశాలకు రిజిస్ట్రేషన్‌ మొదలు.. దరఖాస్తులు, సర్టిఫికెట్ల పరిశీలన, రిజర్వేషన్ల విధానం వంటి అన్ని ప్రక్రియలను ఆన్‌లైన్‌ ద్వారా పూర్తిచేయడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రవేశాల ప్రక్రియను విద్యార్థులకు మరింత సులభతరం చేసేందుకు దోస్త్‌ యాప్‌ను తీసుకురావడంపై దృష్టి సారించారు. ఈమేరకు గురువారం హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో అధికారులు సమావేశమై పలు అంశాలపై చర్చించారు.


logo