ఆదివారం 05 జూలై 2020
Telangana - Jul 01, 2020 , 14:50:02

‘దోస్త్‌’ రిజిస్ట్రేషన్లు నిలిపివేత

‘దోస్త్‌’ రిజిస్ట్రేషన్లు నిలిపివేత

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్‌) రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. ఈమేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కౌన్సిల్‌ అధికారులు వెబ్‌సైట్‌లో ప్రకటన చేశారు. జూన్ 22న దోస్త్‌ 2020 రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం ప్రారంభించింది. షెడ్యూల్ ప్రకారం, డిగ్రీ కోర్సుల్లో మొదటి దశ ప్రవేశాలు జులై 1 నుంచి 14 వరకు, వెబ్‌ ఆప్షన్లు జులై 6 నుంచి 15 వరకు పెట్టుకునే విధంగా షెడ్యూల్ విడుదల చేశారు. జులై 22న సీట్ల కేటాయింపు జరుగనున్నట్లు పేర్కొన్నారు. కానీ ప్రస్తుతానికి వాయిదా వేశారు.  త్వరలో రిజిస్ట్రేషన్‌ ప్రారంభ తేదీని ప్రకటిస్తామని దోస్త్‌ కన్వీనర్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo