సోమవారం 25 మే 2020
Telangana - Mar 30, 2020 , 13:43:52

మనం సైతం..కరోనా అంతానికి సాయంచేద్దాం

 మనం సైతం..కరోనా అంతానికి సాయంచేద్దాం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రపంచా న్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారిపై పోరాటానికి అందరం చేయిచేయి కలపాల్సిన తరుణం ఆసన్నమైంది. కరోనా వ్యాప్తి ని యంత్రణ కోసం తెలంగాణ ప్రభుత్వం సమర్థవంతంగా చేపడుతున్న చర్యలకు మనవంతుగా సహకారం అందించాల్సిన సమయం వచ్చింది. ఆపత్కాలంలో అండగా నిలువాల్సి న సందర్భమిది. మేము సైతం అంటూ పలువురు సామాన్యులు కూడా ‘నమస్తే తెలంగాణ’ కార్యాలయానికి ఫోన్లు చేసి.. ప్రభుత్వానికి ఉడతా సాయంగా విరాళాలు ఎలా అందజేయాలని వివరాలు అడుగుతున్నారు. చలో ఇక స్వచ్ఛందంగా కదులుదాం.. కరోనాపై పో రాటానికి చేయూతనిద్దాం. ప్రజల నుంచి వచ్చే విరాళాలపై సెక్షన్‌80జీ కింద ఆదాయం పన్ను మినహాయింపు కూడా లభిస్తున్నది. 

విరాళాలు అందజేయాలనుకొనేవారు మీసేవా ద్వారాగానీ,  నేరుగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ బ్యాంకు ఖాతాలోగానీ జమ చేయవచ్చు

మీసేవ ద్వారా విరాళం ఇవ్వాలనుకునేవారు ఇక్కడ క్లిక్‌ చేయండి  https://ts.meeseva.telangana.gov.in/Covid/CovidContribution.htm 

నేరుగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు జమ చేయాలనుకునేవారు కింది బ్యాంకు ఖాతాద్వారా పంపవచ్చు..
logo