గురువారం 28 మే 2020
Telangana - May 03, 2020 , 12:19:32

మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డికి విరాళాల అందజేత

మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డికి విరాళాల అందజేత

నిర్మల్‌ : కరోనాపై పోరాట చర్యలకుగాను ప్రభుత్వానికి చేయూతగా పలువురు దాతలు సీఎంఆర్‌ఎఫ్‌కు నిధులను అందజేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా నిర్మల్‌ పట్టణంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని పలువురు కలిసి తమ వంతు చేయూతన విరాళాలను చెక్కుల రూపంలో అందజేశారు. నిర్మల్‌ రైస్‌ మిల్‌ అసోసియేషన్‌ సభ్యులు నర్సాగౌడ్‌, పడిగేలా శ్రీచరణ్‌, గోపి ఒక్కొక్కరు రూ. లక్ష చొప్పున మొత్తం రూ. 3 లక్షలను చెక్కులుగా అందజేశారు. వ్యాపారవేత్త పొలిశెట్టి సురేందర్‌ రూ. 25,555ను అందించాడు. అదేవిధంగా ప్రముఖ కాంట్రాక్టర్‌ లక్కడి జగన్మోహన్‌రెడ్డి రూ. 6 లక్షల చెక్కు, నిర్మల్‌ కిరోసిన్‌ డీలర్ల సంస్థ చిటికేశి విశ్వనాథ్‌, ముక్క జనార్దన్‌ రూ. లక్ష ను మంత్రికి అందజేశారు.
logo