శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 14, 2020 , 15:34:19

ఆందోళన వద్దు.. కరోనా ఉధృతి తగ్గాక ట్రిపుల్ ఐటీ పరీక్షలు

ఆందోళన వద్దు.. కరోనా  ఉధృతి తగ్గాక ట్రిపుల్ ఐటీ పరీక్షలు

నిర్మల్ : బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కరోనా ఉధృతి తగ్గాక పరీక్షలు నిర్వహిస్తామని  అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రాజేశ్వరరావు  తెలిపారు. ఆర్జీయూకేటీ  వైస్ చాన్స్ లర్  రాహుల్ బొజ్జా ఆదేశాల మేరకు పరీక్షలు వాయిదా వేశామన్నారు. మొదట పీ-2, ఈ-4 విద్యార్థులకు పరీక్షలు ఉంటాయని, అనంతరం పీ1, ఈ-1,ఈ-2,ఈ-3 విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేస్తామన్నారు. వీరికి వచ్చే విద్యా సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఏ విషయమైనా వెబ్ లో నోటీస్ ద్వారా తెలియజేస్తామని పేర్కొన్నారు.logo