గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 22, 2020 , 20:42:23

పెట్రోల్‌, డీజిల్‌.. బెంగ అవసరం లేదు

పెట్రోల్‌, డీజిల్‌.. బెంగ అవసరం లేదు

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించేందుకు గానూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 31 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. నిత్యావసర వస్తువులు, సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించాయి. కానీ, అత్యవసర సేవల విభాగంలో(హాస్సిటల్స్‌, మెడికల్‌ స్టోర్స్‌, మీడియా, పోలీసు సిబ్బంది) పనిచేసే ఉద్యోగులైతే తప్పనిసరిగా బయటకు రావాల్సి ఉంటుంది. 

ఇతర రాష్ర్టాల నుంచి రవాణా బంద్‌ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ఇంధనం గురించి వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. కానీ, వాహనాదారులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని తెలంగాణ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్‌ వినోద్‌ తెలిపారు. రాష్ట్ర వాహనదారులకు సరిపడా పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు రాష్ట్రంలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 3 వేలకు పైగా ఔట్‌లెట్స్‌ ఉన్నాయనీ.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

కాగా, నిత్యావసర సేవలు ఎప్పటికీ అందుబాటులో ఉంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌లో తెలిపిన విషయం విదితమే. 


logo