శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 03, 2020 , 22:10:18

కరోనాపై మెట్రో రైలు ప్రయాణికులు ఆందోళన చెందవద్దు..

కరోనాపై మెట్రో రైలు ప్రయాణికులు ఆందోళన చెందవద్దు..

హైదరాబాద్:  హైదరాబాద్ లో కరోనా (కోవిడ్-19) కేసు నమోదైన నేపథ్యంలో మెట్రోరైలు అధికారులు అప్రమత్తమయ్యారు. మెట్రో స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక పరిశుభ్రత చర్యలు తీసుకుంటున్నట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రకటనల ద్వారా కరోనాపై ప్రయాణికులకు అవగాహన కల్పిస్తామన్నారు. కరోనాపై మంత్రులు కేటీఆర్, ఈటల నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, మెట్రో ప్రయాణికులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కోరారు. కరోనా విషయంలో భయాందోళన చెందవద్దని,  ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. 


logo