గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 22, 2020 , 13:50:41

జనతా కర్ఫ్యూని పనిష్మెంట్ అనుకోకండి..

జనతా కర్ఫ్యూని పనిష్మెంట్ అనుకోకండి..

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జనతా కర్ఫ్యూలో భాగంగా మా కుటుంబ సభ్యులమంతా ఇంట్లోనే ఉన్నాము. గౌరవ ప్రధాని, సిఎం ఇచ్చిన పిలుపు మేరకు 24 గంటల జనతా కర్ఫ్యూని అందరం కలిసి విజయవంతం చేద్దాం. వ్యక్తిగత నియంత్రణ పాటిద్దాం. నియంత్రణ ఒక్కటే శ్రీరామ రక్ష. కరోనా మహమ్మారి నుంచి ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రజానికాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు.  ముఖ్యమంత్రి  కేసిఆర్ పిలుపు మేరకు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి కర్ఫ్యూని విజయవంతం చేస్తున్నందుకు ధన్యవాదాలు. 

ఈ రోజు ఇలా ఉండడం కొంత ఆందోళనకరంగా ఉన్నా..చాలా రోజుల తర్వాత పూర్తి సమయం కుటుంబ సభ్యులతో ఉండడం సంతోషం ఇచ్చింది.  ఇది పనిష్ మెంట్ గాకాకుండా అందరు కలిసి ఉండేలా, కుటుంబ సంబంధాలు బలపడేలా దీనిని ఉపయోగించుకోవాలి. ఈరోజు సాయంత్రం 5 గంటలకు చప్పట్లతో ప్రభుత్వానికి మనందరి సంఘీభావం ప్రకటిద్దాం. కరోనాపై చేసే యుద్ధంలో మనవంతు పాత్ర పోషిద్దాం. చప్పట్లతో ఈ కర్ఫ్యూలో పాలుపంచుకునే వారందరికీ తోడుగా ఉందాం. వారికి ముందే ధన్యవాదాలు తెలపుతున్నాను. భయానకమైన కరోనాను నియంత్రిద్దాం... కుటుంబమంతా కలిసి ఉందాం అని పిలుపునిచ్చారు.


logo
>>>>>>