మంగళవారం 07 ఏప్రిల్ 2020
Telangana - Mar 25, 2020 , 01:17:49

మార్కెట్ల వద్ద రద్దీ వద్దు

మార్కెట్ల వద్ద రద్దీ వద్దు

-దాణా వాహనాలను అడ్డగించొద్దు

-అధికారులకు మంత్రి ఈటల ఆదేశం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా కూరగాయలు, సూపర్‌ మార్కెట్లవద్ద జనం గుమికూడకుండా చూడాలని, నిత్యావసరాల ధరలు పెరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మం త్రి ఈటల రాజేందర్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రం లాక్‌డౌన్‌లో ఉన్నందున నిత్యావసరాలు, అత్యవసర సేవలపై సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తో కలిసి మంత్రి ఈటల మంగళవారం బీఆర్కేభవన్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరెన్సీ ద్వారా వైరస్‌వ్యాప్తికి అవకాశాలు ఉన్నందున వినియోగదారులు డిజిటల్‌ పేమెంట్లుచేయాలని సూచించారు. మటన్‌, చికెన్‌, కోడిగుడ్లు, ఫిష్‌ మార్కెట్లు తెరిచి ఉంచేందుకు, దాణా సరఫరా వాహనాలు నడుపడానికి వీలుగా ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నారు.


logo