శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 15, 2020 , 17:37:27

డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల కోసం దళారులను ఆశ్రయించొద్దు

డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల కోసం దళారులను ఆశ్రయించొద్దు

మేడ్చల్ : రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నడబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల కోసం నిరుపేదలు ఎవరు కూడా దళారులను ఆశ్రయించి మోసపోవద్దని కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ అన్నారు. చింతల్ లోని క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్భార్ నిర్వహించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన వారందరికి పక్కా గృహాలను అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి బస్తీని సమస్యల రహిత బస్తీలుగా తీర్చిరిద్దుతామన్నారు. 

ప్రజా సమస్యలను పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా క్యాంప్‌ కార్యాలయానకి వచ్చి నేరుగా తనకే తెలుపాలన్నారు. పలువురు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల విషయంలో ఎమ్మెల్యేను కలువగా దళారుల మాటలు నమ్మిమోసపోవద్దని, అర్హులకు తప్పకుండా సొంతింటి కలను నెరవేరుస్తామని ఎమ్మెల్యే ఈ మేరకు వారికి హామీనిచ్చారు. 


logo