శనివారం 11 జూలై 2020
Telangana - Jun 08, 2020 , 10:27:35

సామూహిక కార్యక్రమాలకు స్వస్తి ప‌ల‌కండి

సామూహిక కార్యక్రమాలకు స్వస్తి ప‌ల‌కండి

వ‌రంగ‌ల్ రూర‌ల్: సీఎం కేసీఆర్ క‌రోనా వైర‌స్ కట్టడి కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు వల్ల వలస కార్మికులతో మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ విస్తరిస్తున్నది. దానికి ప్రత్యేకంగా మందులు లేవు. విరుగుడు కూడా ఏమీ లేదు. సామూహిక కార్యక్రమాలకు స్వస్తి ప‌ల‌కండని పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. జిల్లాలోని రాయ‌ప‌ర్తి మండ‌లం మొరిపిరాల క్రాస్ వ‌ద్ద రాయ‌ప‌ర్తి మాజీ జెడ్పీటీసీ దివంగ‌త‌ భూక్య విజ‌య్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడారు.

మాజీ జెడ్పీటీసీ విజ‌య్ సేవ‌లు చిరస్మరణీయ‌మ‌న్నారు. ఆయ‌న కుటుంబానికి అండ‌గా ఉంటామ‌న్నారు. విజ‌య్ విగ్రహ ఏర్పాటుకు సహరించిన వాళ్లందరికి మంత్రి అభినంద‌న‌లు తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రజలు గుంపులుగా ఉండొద్దని చెప్పారు. స్వీయ క్రమశిక్షణతోనే కొవిడ్ ను నిలువరిద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. logo