బుధవారం 27 మే 2020
Telangana - May 10, 2020 , 00:55:19

గ్రీన్‌ జోన్‌లో ఉన్నామని నిర్లక్ష్యం వద్దు

గ్రీన్‌ జోన్‌లో ఉన్నామని నిర్లక్ష్యం వద్దు

  • ముఖానికి మాస్క్‌ లేకుంటే రూ.వెయ్యి జరిమానా 
  • ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు 

సిద్దిపేట కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ: ‘సిద్దిపేట గ్రీన్‌ జోన్‌లో ఉన్నదనే నిర్లక్ష్యం వద్దు.. ముఖానికి మాస్క్‌లేకుండా బయటకి రావొద్దు..  మాస్క్‌ లేకుండా బయట తిరిగితే రూ.వెయ్యి జరిమానా వేస్తాం’ అని ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేటలో టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి కరుణ కాంతి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 1,400 కుటుంబాలకు, తాడూరి బాలాగౌడ్‌ ఫంక్షన్‌ హాల్‌లో కోవిద సహృదయ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 400 మంది చేనేత కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ, మహిళలకు సీమంతం కార్యక్రమాలు చేపట్టారు. బాలాజీ గార్డెన్‌లో నియోజకవర్గ పరిధిలోని 300 మంది క్రైస్తవులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. పేదలను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నదని గుర్తుచేశారు. కరోనా విపత్కర సమయంలో కోవిద సహృదయ ఫౌండేషన్‌ నిరుపేదలకు బాసటగా నిలువడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు డాక్టర్‌ అనూహ్యరెడ్డి సేవలను మంత్రి అభినందించారు. 


logo