బుధవారం 03 జూన్ 2020
Telangana - May 12, 2020 , 18:08:51

బొగ్గు ఉత్పత్తికి ఆటంకాలు రానీయొద్దు

బొగ్గు ఉత్పత్తికి ఆటంకాలు రానీయొద్దు

హైదరాబాద్‌ : లాక్ డౌన్   సమయం లోనే కాకుండా వచ్చే వర్షాకాలం లో కూడా  సింగరేణిలో తగినంత బొగ్గు ఉత్పత్తి, రవాణా సాధించేందుకు అమలు చేయాల్సిన ప్రణాళికలపై సంస్థ సీఎండీ శ్రీధర్ హైదరాబాద్ సింగరేణి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.లాక్ డౌన్ సమయంలో విద్యుత్ సంస్థలకు అవసరమైన బొగ్గును సరఫరా చేయగలిగిన ప్పటికీ ఇతర పరిశ్రమలు మూతపడి ఉన్నందున  వాటికి బొగ్గు సరఫరా  చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. అయితే  పరిశ్రమలు అన్ని తిరిగి ప్రారంభమయితే, తగినంత  బొగ్గు ఉత్పత్తి, రవాణా పూర్తిస్థాయిలో  జరిపేందుకు సంసిద్ధం కావాలని   ఆయన  అధికారులను ఆదేశించారు.  

కరోనా వ్యాప్తి నివారణకు అన్ని ఏరియాల్లో గట్టి చర్యలు ఇలాగే కొనసాగించలని, కార్మికులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వహించాలని కోరారు. జూన్ రెండో వారం నుంచి వర్షాలు కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో వర్షాకాలంలో ఉత్పత్తి కుంటు బడకుండ తగు చర్యలు తీసుకోవాలన్నారు. సంస్థ ను కాపాడుకుంటూ ముందుకు వెళ్లడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించాలన్నారు. విపత్కర పరిస్థితుల్లో కూడా సింగరేణి సంస్థ ను సజావుగా నడపడానికి ఇప్పటి నుండే ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎండీ సూచించారు. గనుల వారీగా ఉత్పత్తి , ఓవర్ బర్డెన్ తొలగింపు పనులు, బొగ్గు రవాణా మొదలైన విషయాలపై ఆయన అధికారులతో లోతుగా సమీక్షించారు .

 

 logo