ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Telangana - Jan 27, 2021 , 22:10:53

జగత్ విఖ్యాత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయొద్దు

జగత్ విఖ్యాత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయొద్దు

హైదరాబాద్ : బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటీషన్‌ను వచ్చే శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు సికింద్రాబాద్‌ కోర్టు తెలిపింది. ఈ కేసులో జగత్ విఖ్యాత్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని, బెయిల్‌ మంజూరు చేయొద్దని పోలీసులు కోర్టులో కౌంటర్‌ దాఖలు చేశారు. ఈ కేసులో కీలక నిందితుడైన జగత్ విఖ్యాత్ రెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. కాగా, ఇదే కేసులో అరెస్టు అయిన మరో 15 మంది నిందితులు సైతం కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపైనా శుక్రవారం విచారణ జరుపనున్నట్లు కోర్టు పేర్కొంది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo