బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 24, 2020 , 02:48:40

కరోనా టెస్టులతో వ్యాపారం వద్దు

కరోనా టెస్టులతో వ్యాపారం వద్దు

  • పరీక్షలంటూ ల్యాబ్‌లు మార్కెటింగ్‌చేస్తే చర్యలు
  • వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ హెచ్చరిక

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తామంటూ డయాగ్నోస్టిక్స్‌ సెంటర్లు మార్కెటింగ్‌కు దిగితే కఠిన చర్యలు ఉంటాయని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ హెచ్చరించారు. క్లిష్టసమయంలో వైరస్‌ పరీక్షలను వ్యాపార కోణంలో చూడవద్దని, ప్రజలకు, ప్రభుత్వానికి సహకరించాలని హితవుపలికారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు అనుమతి పొందిన డయాగ్నొస్టిక్స్‌ సెంటర్ల ప్రతినిధులతో మంత్రి ఈటల రాజేందర్‌, ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ శాంతికుమారి, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పాజిటివ్‌ వచ్చిన ప్రతి బాధితుడి వివరాలను పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని, వైద్యారోగ్యశాఖకు సమాచారం అందించాలని సూచించారు. టెస్టు కోసం వచ్చిన ప్రతి ఒక్కరూ ఫలితాలు వచ్చేవరకు ఐసొలేషన్‌లో ఉండేలా చూడాలని తెలిపారు. ఎలాంటి లక్షణాలు లేనివారికి పరీక్షలు చేయవద్దని, విమాన ప్రయాణాలు చేసినవారికి లక్షణాలు లేకున్నా టెస్టులుచేసి రిపోర్టు ఇచ్చుకోవచ్చని స్పష్టంచేశారు. 


logo