మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 07, 2020 , 07:01:06

తిరుమలకు తొందరపడి భక్తులు రావద్దు

తిరుమలకు తొందరపడి భక్తులు రావద్దు

తిరుమల: దూరప్రాంతాల నుంచి భక్తులెవరూ తొందరపడి తిరుమలకు రావొద్దని టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ సూచించారు. ముందే ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు బుక్‌చేసుకొని వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని మీడియాకు వెల్లడించారు. అలిపిరి వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌, శానిటైజేషన్‌, వాహనాల తనిఖీల అనంతరం దర్శన టికెట్లు ఉన్న వారిని మాత్రమే తిరుమలకు అనుమతిస్తారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిబందనలను అనుసరించి 10 సంవత్సరాలలోపు చిన్నారులను, 65 సంవత్సరాలు పైబడిన వృద్దులను ఎట్టి పరిస్థితుల్లో కొండపైకి అనుమతించేది లేదన్నారు.


logo