బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 21, 2020 , 22:21:40

కరోనా నివారణ మందులంటూ ప్రచారాలను నమ్మొద్దు..

కరోనా నివారణ మందులంటూ ప్రచారాలను నమ్మొద్దు..

హైదరాబాద్‌ : కరోనా మన దరికి చేరకుండా ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నామో అంతే అప్రమత్తంగా కరోనా పరంగా జరిగే సైబర్‌ మోసాలకు దూరంగా ఉండాలని రాచకొండ సైబర్‌ క్రైం ఏసీపీ హరినాథ్‌ కోరారు.ఈ సందర్భంగా కరోనా నివారణ వాక్సిన్‌లు ఉన్నాయి, కరోనాను నివారించే మందులు ఉన్నాయి, మీకు శానిటజైర్‌లు అత్యంత ధరకు గంటల్లోనే అందిస్తాం, కరోనా వైరస్‌ను తట్టుకునే మాస్క్‌ విక్రయిస్తున్నాం కోనుగోలు చేయండి...కరోనా నియంత్రణకు అవసరమైన అయుర్వేద ఔషదాలతో తయారు చేసిన మందులన సరఫరా చేస్తామని సోషల్‌ మీడియాలో వచ్చే ప్రకటనలను అసలు నమ్మొద్దని ఆయన తెలిపారు.

కరోనాను అవకాశంగా మార్చుకుని సైబర్‌ మాయగాళ్లు పంజా విసిరే అవకాశం ఉంటుందన్నారు. కాబట్టి కరోనా నియంత్రణకు మందులు ఉన్నాయని ఫోన్‌ కాల్స్‌ వచ్చినా, ముందుగా డబ్బులు చెల్లిస్తే పంపిస్తామని చెప్పినా, మీరు జస్ట్‌ మేము పంపిన క్యూ ఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే మీ ఇంటికి డెలివరీ అవుతాయని అంటే అది సైబర్‌ మోసమని గ్రహించాలని సూచించారు. మీ అప్రమత్తంతో కరోనా, కరోనా పేరుతో వచ్చే మోసాలను తరిమికొట్టండి హరినాథ్‌ విజ్ఞప్తి చేశారు. ఏదైన మందులు ఉన్నాయంటే ప్రభుత్వం అధికారికంగా తెలుపుతుందని, వాటినే నమ్మాలని ఆయన స్పష్టం చేశారు.logo