గురువారం 28 మే 2020
Telangana - May 01, 2020 , 12:49:27

కరోనాపై అలసత్వం వద్దు.. అప్రమత్తంగా ఉందాం

కరోనాపై అలసత్వం వద్దు.. అప్రమత్తంగా ఉందాం

కోదాడ: కరోనా వైరస్‌ విషయంలో ఏ మాత్రం అలసత్వం పనికిరాదని, ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి సూచించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఎన్‌ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ సిబ్బంది, పేదలకు దుస్తులు, బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారికి కార్మిక దినోత్స శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల రాష్ట్రంలో కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టిందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనాను కట్టడి చేసేందుకు రోగ నిరోధక శక్తిని పెంచే బత్తాయి, నిమ్మ పండ్లను ఎక్కువగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కరోనా ఆపత్కాలంలో పేదలకు, మున్సిపల్‌ సిబ్బందికి ప్రతి ఒక్కరు అండగా నిలవాలన్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పిలిపుమేరకు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. 


logo