గురువారం 04 జూన్ 2020
Telangana - May 07, 2020 , 15:48:14

లాక్‌డౌన్‌ వెసులుబాటును దుర్వినియోగం చేయొద్దు : మంత్రి ఎర్రబెల్లి

 లాక్‌డౌన్‌ వెసులుబాటును దుర్వినియోగం చేయొద్దు : మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్‌ : లాక్ డౌన్ వెసులు బాటుని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయవద్దని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. లాక్ డౌన్ నేప‌థ్యంలో హైద‌రాబాద్ లోని త‌న ఇంట్లో కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి మంత్రి ఉత్సాహంగా  క్యార‌మ్స్ ఆడారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజలకు ఇబ్బందులు కావొద్దనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ గ్రీన్, ఆరెంజ్ జోన్లు ఉన్న ప్రాంతాల్లో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో వెసులు బాటు ఇచ్చార‌న్నారు. అయితే, అందివ‌చ్చిన స్వేచ్ఛని యథేచ్ఛగా వాడుకోవద్దన్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాల‌ని, కుటుంబ స‌భ్యుల‌తో హాయిగా గ‌డ‌పాల‌ని సూచించారు. 


logo