శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Apr 30, 2020 , 17:15:15

విపత్తు సమయంలో దాతలు ప్రజలను ఆదుకోవాలి: మ‌ంత్రి అల్లోల‌

విపత్తు సమయంలో దాతలు ప్రజలను ఆదుకోవాలి: మ‌ంత్రి అల్లోల‌

నిర్మ‌ల్ : కరోనా సంక్షోభం సమయంలో ఉదార విరాళాలు ఇవ్వడానికి  దాతలు స్వచ్ఛందంగా  ముందుకు రావాల‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి కోరారు. నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలోని ఓ హోట‌ల్ లో ఆయా సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పాల్గొన్నారు.  ఈ సంద‌ర్బంగా మంత్రి మాట్లాడుతూ...  కరోనా వైరస్‌ నియంత్రణకు వివిధ రకాల వస్తువులు కొనుగోలు చేసేందుకు, కామన్‌ క్వారంటైన్‌లో వసతులు కల్పించేందుకు విరాళాలు ఇవ్వాలన్నారు. ప్రజలతో పాటు కరోనా నియంత్రణకు ముందుండి పని చేస్తున్న వైద్యారోగ్య, పోలీసు, పారిశుధ్య సిబ్బంది, కార్మికుల ఆరోగ్య రక్షణను బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఆపద సమయంలో ప్రజలను ఆదుకోవడానికి ముందుకురావాల‌ని కోరారు.  ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి విరాళాలు ఆర్టీజీఎస్‌, ఆన్‌లైన్‌, చెక్కు, డీడీ రూపంలో ఇవ్వొచ్చన్నారు.ఈ సంద‌ర్బంగా దాత‌లు సీయం రిలీఫ్ ఫండ్ కు విరాళాల  చెక్కులను‌ మంత్రికి  అంద‌జేశారు.


logo