శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 27, 2020 , 12:22:38

దాతలు ఆన్‌లైన్‌ ద్వారా ప్రభుత్వ ఖాతాకు జమచేయాలి : శ్రీదేవసేన

దాతలు ఆన్‌లైన్‌ ద్వారా ప్రభుత్వ ఖాతాకు జమచేయాలి : శ్రీదేవసేన

ఆదిలాబాద్‌ : దాతలకు ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఏ.శ్రీదేవసేన ఓ విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో బాధితుల సహాయార్థం దాతలు ఇచ్చే విరాళాలు ఆన్‌లైన్‌ ద్వారా ప్రభుత్వ ఖాతాకు జమచేయాల్సిందిగా ఆమె పేర్కొన్నారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌, కలెక్టరేట్‌ బ్రాంచ్‌, ఆదిలాబాద్‌. అకౌంట్‌ నంబర్‌ 38752072682. IFSC కోడ్‌ SBI-0020547 నకు ఆన్‌లైన్‌లో బదిలీ చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. బదిలీ చేసిన మొత్తానికి సంబంధించిన ధృవీకరణ రసీదును స్క్రీన్‌ షాట్‌ తీసి కలెక్టరేట్‌ పరిపాలనాధికారి సెల్‌ నంబర్‌ 9491053564 కు పంపించాలన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో సామాజిక దూరం పాటించాల్సి ఉన్నందున దాతలు ఎవరూ కూడా వ్యక్తిగతంగా చెక్కులు తీసుకురావొద్దని కోరారు.


logo