శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 13, 2020 , 16:44:52

క‌ష్ట ‌కాలంలో దాత‌లు ముందుకు రావాలి

 క‌ష్ట ‌కాలంలో దాత‌లు ముందుకు రావాలి

మ‌హ‌బూబాబాద్ : క‌ష్ట కాలంలో దాత‌లు ముందుకు రావావాలని పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. తొర్రూరు జడ్పీహెచ్‌ఎస్‌ లో ఉత్సవ కల్చరల్ అండ్ డెవలప్ మెంట్ వారి అధ్వ‌ర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నిరుపేద‌ల‌ను ఆదుకోవ‌డంలో దాతలు ముందుండాలన్నారు. మ‌న‌మంతా ఒక‌రికొక‌రం అండ‌గా ఉంటూ క‌రోనా క‌ట్ట‌డి అయ్యే వ‌ర‌కు ప‌క‌డ్బందీగా లాక్ డౌన్ ని పాటించాలని తెలిపారు. 

 కరోనా మ‌హ‌మ్మారి దేశాల‌ను, ప్ర‌జ‌ల‌ను, ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌ను అత‌లాకుత‌లం చేసింద‌న్నారు. ఈ ద‌శ‌లో నిరుపేద ప్ర‌జ‌ల‌ను ఆదుకోవ‌డానికి దాతలు ముందుకు రావాల‌ని మంత్రి పిలుపునిచ్చారు.  క‌రోనా అంత‌మ‌య్యే వ‌ర‌కు ప్ర‌జ‌లు లాక్ డౌన్ ని పాటించాల‌ని, భౌతిక దూరంతో  పాటు స్వీయ నియంత్ర‌ణ‌ పాటించి క‌రోనాని ఎదుర్కోవాల‌ని మంత్రి తెలిపారు.


logo