సోమవారం 13 జూలై 2020
Telangana - Apr 12, 2020 , 16:15:49

దాతలు ధాతృత్వాన్ని చాటుకోవాలి

దాతలు ధాతృత్వాన్ని చాటుకోవాలి

హైదరాబాద్:  క‌రోనా వైరస్ నిర్మూల‌న వంటి విపత్కర ప‌రిస్థితుల్లో ప్రజలను ఆదుకోవడానికి దాతలు తమ విరాళాలతో ముందుకు వచ్చి ధాతృత్వాన్ని చాటుకోవాల‌ని దాత‌ల‌కు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పిలుపు నిచ్చారు. అపన్నులని ఆదుకోవడంలో ముందుండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. క‌రోనా నిర్మూల‌న కోసం సీఎం కేసీఆర్ ప‌డుతున్న శ్ర‌మ‌ని ఆయ‌న గుర్తు చేశారు. దేనికీ వెర‌వ‌కుండా ప్ర‌జ‌ల‌ను ఆదుకోవ‌డానికే ప్ర‌థ‌మ ప్రాధాన్య‌మిస్తున్న సీఎం కేసీఆర్ కి, ప్ర‌భుత్వానికి అండ‌గా నిలుస్తున్న‌వాళ్ళంద‌రినీ మంత్రి అభినందించారు. 

ఈ సంద‌ర్భంగా వరంగల్ కి చెందిన  హై కోర్టు అడ్వకేట్ ఇ శివరావు, హైదరాబాద్ లో గల మంత్రుల నివాస ప్రాంగణంలోని  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని కలిసి రూ. లక్ష ను విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు చెక్కుని మంత్రికి అందించారు. పాలకుర్తి నియోజకవర్గంలో కరోనా వైరస్ నిర్మూలన కు ఉపయోగించాలని శివరావు మంత్రి ని కోరారు. అందుకు మంత్రి ఎర్ర‌బెల్లి శివరావుకి కృత‌జ్ఞ‌తలు తెలిపి అభినందించారు. 


logo