గురువారం 28 మే 2020
Telangana - May 20, 2020 , 10:22:14

పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలి

పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలి

వరంగల్ అర్బన్ : లాక్ డౌన్ నేపథ్యంలో అభాగ్యులను ఆదుకునేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. మరోవైపు ప్రభుత్వం కృషికి తోడు దాతలు, స్వచ్ఛంద సంస్థలు మేము సైతం అంటూ ముందుకొచ్చి తమ ఔదార్యాన్ని చాటుతున్నారు. తాజాగా వరంగల్ తూర్పులోని దేశాయిపేటలో పెద్ద ఎత్తున నిరుపేదలకు నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ సమక్షంలో  ఏమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో  పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలన్నారు.


logo