బుధవారం 03 జూన్ 2020
Telangana - May 07, 2020 , 14:53:51

దాతల ప్రోత్సాహం వెలకట్టలేనిది : ఎస్పీ శశిధర్ రాజు

దాతల ప్రోత్సాహం వెలకట్టలేనిది : ఎస్పీ శశిధర్ రాజు

 నిర్మల్ : నిర్మల్ గ్రామీణ పోలీస్ స్టేషన్, సాయుధ దళా కార్యాలయంలో నిర్మల్ గ్రామీణ/సోన్ సీఐలు శ్రీనివాస్ రెడ్డి, జీవన్ రెడ్డి  ప్రోత్సాహంతో నెస్లే కంపెణీ నిర్మల్ డీలర్ ప్రణీత, శేఖర్  సౌజన్యంతో విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి నెస్లే కంపెనీ ఎనర్జీ పౌడర్, వాటర్ మిల్లర్ లను జిల్లా ఎస్పీ శ్రీ.సి.శశిధర్ రాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో అవిశ్రాంతంగా విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి తోచిన రీతిలో సహాయం చేసేందుకు దాతలు ముందుకు వస్తున్నారని వారందరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఎస్పీ  పేర్కొన్నారు. 


logo