మంగళవారం 26 మే 2020
Telangana - May 14, 2020 , 20:43:04

భద్రాద్రిలో నిత్యాన్నదానానికి రూ.38 లక్షలు విరాళం

భద్రాద్రిలో నిత్యాన్నదానానికి రూ.38 లక్షలు విరాళం

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శాశ్వత నిత్యాన్నాదానానికి ఎన్‌ఆర్‌ఐ ఐకా రవి తన తండ్రి బాలయ్య (పాల్వంచ వాస్తవ్యుడు) జ్ఞాపకార్థ్దం రూ.38 లక్షలను విరాళంగా అందజేశారు. ఈ నగదును ఆన్‌లైన్‌ ద్వారా దేవస్థానానికి సమర్పించారు. నిత్యాన్నదానానికి సంబంధించిన బాండ్‌ను దాతల కుటుంబానికి స్నేహితుడు రాజుకు దేవస్థానం ఈవో నర్సింహులు అందజేశారు. ఈ సందర్భంగా దేవాలయం పూజారులు మాట్లాడుతూ... ఆన్‌లైన్‌లో పూజలు చేయించుకునే భక్తులు టీ యాప్‌ ఫోలియో ద్వారా, మీ సేవా ద్వారా పేర్లు నమోదు చేసుకుని పూజలు చేయించుకోవచ్చని తెలిపారు. ఆన్‌లైన్‌ ద్వారా పూజలు చేయించుకుంటున్న భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందని పేర్కొన్నారు. logo