బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Oct 06, 2020 , 16:23:02

ఎర్రబెల్లి ట్రస్ట్ కు ల‌క్ష విరాళం అందజేత

ఎర్రబెల్లి ట్రస్ట్ కు ల‌క్ష విరాళం అందజేత

వరంగల్ రూరల్ : ఎర్రబెల్లి  ట్రస్ట్ కు రెడ్డి బ్రదర్స్ ప్రైవేట్ సెక్యూరిటీ స‌ర్వీసెస్ సంస్థ రూ. ల‌క్ష విరాళాన్ని అంద‌జేసింది. ఆ సంస్థ ప్రతినిధులు ఎండీ హ‌ఫీజుద్దీన్, రాగి ర‌వీంద‌ర్ రెడ్డి ఈ మేర‌కు చెక్కుని  పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావుకు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. మంత్రి త‌మ ట్రస్ట్ త‌ర‌ఫున అనేక మంది నిరుపేద‌ల‌కు ఎన్నో సేవ‌లు అందిస్తున్నార‌ని ప్రశంసించారు. క‌రోనా స‌మ‌యంలో చేసిన సేవ‌లు, అందించిన నిత్యావ‌స‌ర స‌రుకులు, మాస్కుల అందజేత పనులు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్రబెల్లి ఆ సంస్థ ప్రతినిధులంద‌రినీ అభినందించారు. మాన‌వ సేవే, మాధ‌వ సేవ‌గా భావించాల‌ని సూచించారు.logo