శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 24, 2020 , 02:20:38

ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌ విరాళం.. 10 లక్షలు

ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌ విరాళం.. 10 లక్షలు

  • గిఫ్ట్‌ ఏ స్మైల్‌లో రాందేవరావు వైద్యశాలకు అందజేత
  • మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా దాతృత్వం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మంత్రి కే తారకరామారావు పుట్టినరోజును పురస్కరించుకొని ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌ తన ఔదార్యం చాటుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్‌ ఏ స్మైల్‌ పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించాలని గతేడాది మంత్రి కేటీఆర్‌ పార్టీ శ్రేణులకు, అభిమానులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా నవీన్‌కుమార్‌ ఈ ఏడాది కేటీఆర్‌ పుట్టినరోజును పురస్కరించుకొని పేదలకు తక్కువ ఖర్చుతో వైద్యసేవలను అందిస్తున్న శివానంద పునరావాస కేంద్రానికి చెందిన కూకట్‌పల్లిలోని రాందేవ్‌రావు వైద్యశాలకు రూ. 10,01,116 విరాళంగా అందజేశారు. ఆ నిధులతో వైద్యశాలలో వెంటిలేటర్లు, అత్యవసర విభాగంలో 5 పారాపేషెంట్‌ మానిటరింగ్‌ పరికరాలను ఏర్పాటుచేయాలని సూచించారు. దివ్యాంగులైన చిన్నారులకు సేవలందిస్తున్న ఖైరాతాబాద్‌లోని శంకర్‌ ఫౌండేషన్‌ భవన మరమ్మతులు, సుందరీకరణకు అయ్యే ఖర్చును విరాళంగా అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. 

మొక్కలు నాటాలని విద్యామండలి చైర్మన్‌ పిలుపు

కేటీఆర్‌ పుట్టినరోజున అన్నివర్సిటీలు, విద్యాసంస్థల్లో పెద్దఎత్తున మొక్కలు నాటాలని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు వర్సిటీ, కాలేజీ పెద్దలు చర్యలు చేపట్టాలన్నారు. దక్షిణాఫ్రికాలోని మిడ్‌రాండ్‌ ఠాణాలో పోలీసులకు ఫేస్‌షీల్డులను అందజేసినట్టు టీఆర్‌ఎస్‌ ఎన్నారైశాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు చెప్పారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ ఎన్నారై నాయకులు విష్ణు, వేముల సాయికిరణ్‌ పాల్గొన్నారు.


logo