గురువారం 28 మే 2020
Telangana - May 03, 2020 , 17:00:56

పేద‌ అర్చ‌కుల‌కు నిత్యావ‌స‌రాలు పంపిణీ

పేద‌ అర్చ‌కుల‌కు నిత్యావ‌స‌రాలు పంపిణీ

హైద‌రాబాద్‌: మల్లాపూర్‌ డివిజన్‌లో నివసించే నిరుపేద కుటుంబాలకు చెందిన అర్చకులకు నిత్యావ‌స‌రాలు పంపిణీ చేశారు. ఉప్పల్‌ నియోజకవర్గ ఎంబీసీ ఛైర్మన్‌ ఎస్వీ కిట్టు ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్య‌క్ర‌మం జ‌రిగింది. కరోనా వైరస్‌కు అడ్డుక‌ట్ట వేయ‌డం కోసం లాక్‌డౌన్‌ను అమ‌ల్లోకి రావడంతో ఆల‌యాల్లోకి భ‌క్తుల ప్ర‌వేశంపై కూడా నిషేధం విధించారు. దీంతో నిరుపేద‌ అర్చకుల కుటుంబాల పరిస్థితి దారుణంగా మారింది. ఈ నేప‌థ్యంలో మ‌ల్ల‌పూర్ డివిజ‌న్‌లో పేద అర్చ‌కుల‌కు నిత్యావ‌స‌రాలు అంద‌జేశారు.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo