గురువారం 04 జూన్ 2020
Telangana - May 08, 2020 , 16:59:58

రక్తదానం చేయండి ప్రాణాలు కాపాడండి

రక్తదానం చేయండి ప్రాణాలు కాపాడండి

వ‌రంగ‌ల్ రూర‌ల్: ఇండియ‌న్ రెడ్ క్రాస్ సొసైటీ వందేళ్ళు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో ర‌క్త‌దాన శిబిరం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని  పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖా మాత్యులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్ర‌తి ఒక్క‌రూ ర‌క్త‌దానం చేయాలన్నారు. ఇండియ‌న్ రెడ్ క్రాస్ సొసైటీ సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌న్నారు. రాష్ట్ర ఐటీ, న‌గ‌ర పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు పిలుపు మేర‌కు, పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు సూచ‌న‌తో రాయ‌ప‌ర్తిలో ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు ర‌క్త‌దాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం మంత్రి రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు, నిరుపేదలకు నిత్యావసర సరకుల ను పంపిణీ చేశారు.


logo