గురువారం 28 మే 2020
Telangana - May 06, 2020 , 02:17:15

న్యూయార్క్‌ ఈస్టర్న్‌ జిల్లా జడ్జిగా సరిత కోమటిరెడ్డి

న్యూయార్క్‌ ఈస్టర్న్‌ జిల్లా జడ్జిగా సరిత కోమటిరెడ్డి

  • తెలంగాణ మూలాలున్న మహిళకు అమెరికాలో అరుదైన గౌరవం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:  తెలంగాణ మూలాలున్న మహిళకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్‌లోని ఈస్టర్న్‌ డిస్ట్రిక్ట్‌ జిల్లా జడ్జి పదవికి సరిత కోమటిరెడ్డిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నామినేట్‌ చేశారు. ఆమె నామినేషన్‌ను సెనేట్‌కు పంపినట్లు వైట్‌హౌస్‌ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణకు చెందిన వైద్య దంపతులు హనుమంత్‌రెడ్డి, గీతారెడ్డిల కుమార్తె సరితా కోమటిరెడ్డి. వీరు అమెరికాలోని మిస్సోరిలో నివాసం ఉంటున్నారు. హార్వర్డ్‌ యూనివర్సిటీ నుంచి న్యాయవిద్య పూర్తిచేసిన సరిత ప్రస్తుతం న్యూయార్క్‌ ఈస్టర్న్‌ డిస్ట్రిక్ట్‌ సాధారణ నేరాల విభాగం అటార్నీ కార్యాలయంలో డిఫ్యూటీ చీఫ్‌ అటార్నీగా పనిచేస్తున్నారు. జార్జి వాషింగ్టన్‌ వర్సిటీ, కొలంబియా యూనివర్సిటీల్లో ఆమె విద్యాబోధన కూడా చేశారు. జిల్లా జడ్జిగా సరిత కోమటిరెడ్డి నామినేట్‌ కావడంపై అమెరికాలోని తెలుగు ప్రజలు హర్షం వ్యక్తంచేశారు.logo