శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Feb 25, 2020 , 02:11:15

సూది రంధ్రంలో ట్రంప్‌ సూక్ష్మ శిల్పం

సూది రంధ్రంలో ట్రంప్‌ సూక్ష్మ శిల్పం

వరంగల్‌ కల్చరల్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటనను పురస్కరించుకుని వరంగల్‌కు చెందిన మట్టెవాడ అజయ్‌కుమార్‌ సూది రంధ్రంలో పట్టేంత ట్రంప్‌, అమెరికా జెండా సూక్ష్మశిల్పాన్ని మైనంతో చెక్కారు. ట్రంప్‌ శిల్పం ఎత్తు 1.25 మిల్లీమీటర్లు, వెడల్పు 0.32మిల్లీ మీటర్లు, అమెరికా జెండా ఎత్తు 0.94 మిల్లీమీటర్లు, వెడల్పు 0.64 మిల్లీమీటర్లు ఉన్నాయి. ఈ సూక్ష్మ శిల్పాన్ని రూపొందించడానికి అజయ్‌  నాలుగురోజుల్లో 13 గంటల పాటు శ్రమించారు. గతంలో ఇలాంటివి చాలా చేశారు. గతేడాది అక్టోబర్‌లో  ఏసీజీ వరల్డ్‌ గ్రూపు నిర్వహించిన అంతర్జాతీయస్థాయి ఆర్ట్‌ ఇన్‌ ఏ  క్యాప్సుల్‌ కాంపిటీషన్‌లో తొలి బహుమతిగా 5 వేల డాలర్లు గెలుపొందారు.