మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 08:48:10

ఆ కుటుంబానికి కరోనా ఉందా.? లేదా.?

ఆ కుటుంబానికి కరోనా ఉందా.? లేదా.?

వేములవాడ : రాజన్న సిరిసిల్లా జిల్లాలోని వేములవాడకు  చెందిన కుటుంబంలోని ఓ వ్యక్తి(51) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు ఈనెల 15న దవాఖానకు తీసుకెళ్లగా ఆ వ్యక్తి మరణించాడు. మరణించిన వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో కుటుంబ సభ్యులైన ఏడుగురికి 16న పరీక్షలు నిర్వహించారు. అందులో ఐదుగురికి పాజిటీవ్‌ వచ్చిందంటు 17న వైద్య సిబ్బంది అధికారుల సమక్షంలో ఐసోలేషన్‌ చేశారు. 18వ తేదీ రాత్రి ఆ ఏడుగురు కుటుంబ సభ్యులకు కరోనా నెగిటివ్‌ ఉందని ఏడుగురిలో ఒకరి ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది.

ఈ విషయంపై అధికారులను సంప్రదించగా వారు సంపందించలేదు. దీంతో అసలు తమకు కరోనా ఉందా..? లేదా.? అనే అనుమానంతో ఆ కుటుంబ సభ్యులు ఆయోమయంలో ఉన్నారు. వైద్యులు మరోసారి తమకు కరోనా పరీక్షలు చేయాలని వారు కోరుతున్నారు. అయితే ఆ ఐదుగురికి కరోనా పాజిటివ్‌ ఉందని జిల్లా వైధ్యాధికారి సుమన్‌మోహన్‌రావు తెలిపారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo