శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 14, 2020 , 01:17:04

అర్వింద్‌కుమార్‌కు కేటీఆర్‌ ప్రశంస

అర్వింద్‌కుమార్‌కు కేటీఆర్‌ ప్రశంస

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పురపాలక సిబ్బంది యోగక్షేమాల పట్ల శ్రద్ధ చూపుతున్న మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను, తెలంగాణ సీడీఎంఏ డాక్టర్‌ ఎన్‌ సత్యనారాయణను ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు ప్రశంసించారు. కరోనా కట్టడి చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది ఆరోగ్యానికి సంబంధించి పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఇదివరకే ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీల్లో 45 వేల మంది పారిశుద్ధ్య కార్మికులకు వారానికోసారి ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తూ వారి యోగక్షేమాల పట్ల అధికారులు శ్రద్ధచూపడం పట్ల మంత్రి ఆనందం వ్యక్తంచేశారు. 

చేనేత రంగానికి అండగా మంత్రి కేటీఆర్‌

సిరిసిల్ల చేనేత కళాకారుల నైపుణ్యం ప్రపంచానికి తెలియజేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నదని తెలంగాణ పద్మశాలి అధికారులు వృత్తి నిపుణుల సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాచన రఘనందన్‌ తెలిపారు. పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ చేనేతరంగానికి అండగా ఉంటున్నారని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చేనేత కార్మికులకు ప్రభుత్వపరంగా చేయూతను అందిస్తామన్న మంత్రి కేటీఆర్‌.. లాక్‌డౌన్‌లో నిరసించి నిరాశకు లోనైన నేతన్నల గుండెల్లో ధైర్యం నింపారని తెలిపారు.


logo