ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 03, 2020 , 09:58:20

వరంగల్‌లో అరుదైన 'ప్లాస్టిక్‌ సర్జరీ'

వరంగల్‌లో అరుదైన  'ప్లాస్టిక్‌ సర్జరీ'

  • రోడ్డు ప్రమాద బాధితుడి ముఖానికి విజయవంతంగా శస్త్రచికిత్స
  • ప్రాణాపాయం నుంచి బయటపడిన యువకుడు

వరంగల్ అర్బన్ : రోడ్డు ప్రమాదంలో ముఖానికి తీవ్ర గాయాలై కోమాలోకి వెళ్లిన ఓ యువకుడికి ప్లాస్టిక్‌ సర్జరీ చేసి, ప్రాణాపాయం నుంచి వైద్యులు కాపాడిన సంఘటన వరంగల్‌ ములుగు రోడ్డులోని గార్డియన్‌ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. ఆస్పత్రి నిర్వాహకుడు డాక్టర్‌ పీ కాళీప్రసాదరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పరకాల మండలం నార్లాపూర్‌ గ్రామానికి చెందిన బీ రామచందర్‌ అనే యువకుడు వారం రోజుల క్రితం పరకాల నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మార్గమధ్యలో బ్రిడ్జిపై ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. 

ఈ ప్రమాదంలో రామచందర్‌ ముఖం పైభాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయి తీవ్ర రక్తస్రావానికి గురయ్యాడు. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు పలు దవాఖానల్లో చూపించినా సరైన చికిత్స చేయకపోవడంతో గార్డియన్‌ దవాఖానకు తీసుకొచ్చారని ఆయన తెలిపారు. బాధితుడు కోమాలోకి చేరుకున్నా వైద్యులు శస్త్రచికిత్స చేయడానికి సిద్ధమైనట్లు పేర్కొన్నారు. రామచందర్‌ ముఖం మీద ఎముకలు నుజ్జునుజ్జు కావడంతో వెంటిలేటర్‌ సాయంతో ప్లాస్టిక్‌ సర్జన్‌ డాక్టర్‌ ఎం ఉపేందర్‌, డాక్టర్‌ ఆర్‌శంతన్‌కుమార్‌ టీం కలిసి 12 గంటలపాటు శ్రమించి ప్లాస్టిక్‌ సర్జరీ చేశారని ఆయన వివరించారు. ముఖంపై ఎలాంటి ఎముకలు కనిపించకుండా, కన్ను, ముక్కుకు ఇబ్బందులు రాకుండా ప్లాస్టిక్‌ సర్జరీని విజయవంతం చేశారని తెలిపారు. ప్రస్తుతం క్షతగాత్రుడు రామచందర్‌ ప్రాణాపాయం నుంచి బయటపడి క్షేమంగా ఉన్నాడని డాక్టర్‌ కాళీప్రసాదరావు వెల్లడించారు.logo