న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం (2020-21) అంతా కరోనా మహమ్మారి నీలి నీడలోనే సాగింది.. వేల మంది ఉద్యోగాలు కోల్పోయి అల్లాడితే.. కొందరు కార్పొరేట్ల వ్యక్తిగత సంపద రూ. కోట్లలో పెరిగింది. కానీ గతేడాది పన్ను చెల్లింపుల్లో సగటు భారతీయుడే పై చేయి సాధించాడు.
గతేడాది (2020-21)లో ప్రత్యక్ష పన్ను వసూళ్లలో ప్రతికూల రికార్డు నమోదైంది. కార్పొరేట్ కంపెనీల.. కార్పొరేట్ టాక్స్ కంటే సాధారణ వ్యక్తులు.. వేతన జీవులు చెల్లించే ఆదాయం పన్ను ఎక్కువ. ఇది గత 21 ఏండ్లలో తొలిసారి అని ఆదాయం పన్ను (ఐటీ) శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
ఐటీ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గతేడాది ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.9.45 లక్షల కోట్లు. ఇందులో కార్పొరేట్ టాక్స్ వసూళ్లు రూ.4.57 లక్షల కోట్లు. వ్యక్తిగత ఆదాయం పన్ను వసూళ్లు రూ.4.69 లక్షల కోట్లు. ఇతర పన్ను రూ.16,927 కోట్లు.
2000-01 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్రత్యక్ష పన్నులన్నీ కలిపి రూ.68,305 కోట్లు మాత్రమే. ఇందులో కార్పొరేట్ టాక్స్ వసూళ్లు రూ.35,696 కోట్లు ఉంటే, వేతన జీవుల ఐటీ రిటర్న్స్ రూ.31,764 కోట్లు మాత్రమే. 2003-04లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.లక్ష కోట్ల మార్క్‌ను దాటి రూ.1.05 లక్షల కోట్లకు చేరుకుంది.
పెట్టుబడిదారులను ప్రోత్సహించడానికి 2019 సెప్టెంబర్‌లో నరేంద్రమోదీ సర్కార్ కార్పొరేట్ టాక్స్ తగ్గించి వేసింది. అంతకుముందు 25 శాతంగా ఉన్న కార్పొరేట్ టాక్స్ 10 శాతానికి కుదించారు.
నూతన కంపెనీలపై పన్ను రేటు 17 శాతానికి తగ్గించారు. ఇక వ్యక్తిగత ఆదాయం పన్ను (ఐటీ) మినహాయింపులు రూ. 5 లక్షల వరకు పెంచారు. ఐటీ మినహాయింపుల వల్ల రూ.23,200 కోట్ల ఆదాయం తగ్గింది.
ఇంటి పెద్దను కోల్పోతే రుణ చెల్లింపులు ఎలా..?
ముకేశ్ అంబానీ గతేడాది జీతం సున్నా.. ఎందుకో తెలుసా?
ఈకో ఫ్రెండ్లీ ఫ్యూయల్ : 2023 ఏప్రిల్ నుంచి ఇథనాల్ పెట్రోల్
టాప్ గెయినర్స్ జాబితాలో టైటాన్ , అదానీ పోర్ట్స్…
2.27 కోట్లు.. ఏప్రిల్, మే నెలల్లో కోల్పోయిన ఉద్యోగాలు
లక్షమందికి ఉచిత వ్యాక్సిన్లు: మలబార్
రికార్డు గరిష్టానికి స్టాక్ మార్కెట్లు
ఇప్పుడు కొన్నా.. 3 నెలలకు ఈఎంఐ షురూ.. మహీంద్రా ఆఫర్ !
బిట్ కాయిన్ ముందు ఐదు సవాళ్లు.. అవేంటంటే?!
రెండేళ్ల చిన్నారి..205 దేశాల రాజధానుల పేర్లు చెప్పేస్తోంది.. వీడియో
ఇజ్రాయెల్‌లో అధికార మార్పు: ప్రధానమంత్రిగా బెన్నెట్
నెట్ ఫ్లిక్స్ లో తాప్సీ సినిమా
Poco M3 Pro: పొకో నుంచి వస్తోన్న తొలి 5G ఫోన్ ఇదే..!
మహేష్ ముందడుగు.. అభిమానులలో ఉత్సాహం
COVID Diet : కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ డైట్ ఫాలో అవ్వండి