శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 14, 2020 , 14:35:37

సెల్లార్‌లోకి వ‌ర్ష‌పు నీరు.. విద్యుత్ షాక్‌తో డాక్ట‌ర్ మృతి

సెల్లార్‌లోకి వ‌ర్ష‌పు నీరు.. విద్యుత్ షాక్‌తో డాక్ట‌ర్ మృతి

హైద‌రాబాద్ : బ‌ంజారాహిల్స్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని ఎస్‌బీహెచ్ కాల‌నీలో విషాదం నెల‌కొంది. రాత్రి కురిసిన భారీ వ‌ర్షానికి స్థానికంగా ఉన్న ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లోకి వ‌ర్ష‌పు నీరు వ‌చ్చి చేరింది. సెల్లార్‌లో ఉన్న నీటిని బ‌య‌ట‌కు పంపించేందుకు.. డాక్ట‌ర్ స‌తీష్ రెడ్డి మోటార్ వేసేందుకు వెళ్లాడు. మోటార్ వేస్తుండ‌గా విద్యుత్ షాక్‌తో డాక్ట‌ర్ మ‌ర‌ణించాడు. దీంతో మృతుడి నివాసంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న బంజారాహిల్స్ పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకుని ఉస్మానియా ఆస్ప‌త్రి మార్చురీకి త‌ర‌లించారు. 


logo