సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 22, 2020 , 13:49:29

కరోనాతో వైద్యుడు మృతి

కరోనాతో వైద్యుడు మృతి

హైదరాబాద్‌ : కరోనా మహ్మమారి విజృభిస్తోంది. హైదరాబాద్‌లో రోజురోజుకు కొవి‌డ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంతో ప్రజలు ఇంటినుంచి బయటికి రావాలంటేనే బయపడుతున్నారు. కేవలం సామాన్యులే కాదు వైద్యులు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజా కరోనాతో ఖైరతాబాద్‌కు చెందిన ఓ వైద్యుడు మృతి చెందాడు. ఇటీవల కరోనా నిర్ధారణ అవడంతో కిమ్స్‌ దవాఖానలో చేరిన అతను చికిత్సపొందుతూ ఆదివారం రాత్రి 8 గంటలకు మృతి చెందాడు.

కరోనా నియంత్రణకు ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నా.. కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రజలు బయటికి వెళ్లినప్పుడు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, కరోనా సోకకుండా జాగ్రత్తులు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.


logo