సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 17:59:23

దీపావళి విశిష్టతలు ఇవే !

దీపావళి విశిష్టతలు ఇవే !

దీపావళి… దీప అంటే దీపం అని, ఆవళి అంటే వరుస... దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం.  పురాణేతిహాసాల ప్రకారం..

‘’దీపోజ్యోతిః పరం బ్రహ్మ, దీపః సర్వతమోపహః |

దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే ||’’

అని మన పూర్వీకలు చెప్పారు..  అంటే …దీపం జ్యోతి స్వరూపమైనది. అదే పరంబ్రహ్మం, దీపం చీకటిని పారద్రోలుతుంది. ఈ దీపం వల్లే సర్వకార్యాలు సుగమం అవుతున్నాయి. అటువంటి సంధ్యా దీపమా, నీకు నమస్కారం.  దీపం సర్వవేళలా ఆరాధ్య తేజస్సు. దీపలక్ష్మిగా దీపాన్ని పూజిస్తారు. ఎవరి ఇంట్లో ఎల్లప్పుడూ దీపాలు వెలుగుతూ ఉంటాయో వారే నిజమైన ఐశ్వర్యవంతులని శాస్త్రాల పేర్కొన్నాయి. దీపావళికి ఓ ప్రత్యేకత ఉంది. కొత్త బట్టలు, పిండి వంటలతో పాటు... సాయంత్రం వేళ అందమైన దీపాలు వెలుగుతో ప్రతి ఇల్లు మిరుమిట్లు గొలిపే కాంతుల శోభతో అలరారుతుంది. దీపావళి రోజున ఏ ఇంటి యందు దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో.. ఆ ఇంట మహాలక్ష్మీ ప్రవేశిస్తుందని మన భక్తుల విశ్వాసం. దీపావళి నాడు సాయంత్రం పూట శ్రీలక్ష్మీ స్వరూపమైన తులసీచెట్టు దగ్గర తొలుత దీపాలు వెలిగించి. శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తర శతనామాలతో పూజ చేసి,  అనంతరం గృహమంతా దీపాలంకృతం చేయడం వల్ల మహాలక్ష్మీ ఆ ఇంటిని అనుగ్రహిస్తుందని పురాన వచనం. ‘వెలుగు దివ్వెల పండుగ’ వెనుక ఉన్న కథ ఇదే.. వీడియో )


- కేవీశర్మ

‘వెలుగు దివ్వెల పండుగ’ వెనుక ఉన్న కథ ఇదే..