ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 10, 2020 , 17:42:22

ఎరువుల కొరత రానీయొద్దు: హరీశ్‌రావు

ఎరువుల కొరత రానీయొద్దు: హరీశ్‌రావు

సంగారెడ్డి : సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. రైతు సంక్షేమానికే సర్కారు యేటా రూ.70 వేల కోట్లు వేచ్చిస్తున్నదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. జిల్లా పరిషత్‌ నూతన భవనంలో జడ్పీ చైర్‌ పర్సన్‌ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి అధ్యక్షతన జిల్లా పరిషత్‌ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

వ్యవసాయం, వైద్యం, ఉపాధి హామీలపై సమీక్ష జరిగింది. వానకాలం పంటల సాగు మొదలైన నేపథ్యంలో ఎరువులు, విత్తనాల అందుబాటులో ఉంచాలని, రైతులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పీఏసీఎస్‌లు, డీసీఎంఎస్‌ల ద్వారా గ్రామాలకే ఎరువులు సరఫరా చేయాలని సూచించారు. జిల్లాలో 116 రైతు వేదికల నిర్మాణం యాసంగి వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. 


logo