బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 03, 2020 , 19:24:21

ద‌ళారుల‌కు ధాన్యాన్ని అమ్మొద్దు : క‌ంచ‌ర్ల భూపాల్‌రెడ్డి

ద‌ళారుల‌కు ధాన్యాన్ని అమ్మొద్దు : క‌ంచ‌ర్ల భూపాల్‌రెడ్డి

న‌ల్ల‌గొండ : రైతులు ద‌ళారుల‌కు, క‌మీష‌న్ ఏజెంట్ల‌కు ధాన్యాన్ని అమ్మ‌వ‌ద్ద‌ని న‌ల్ల‌గొండ ఎమ్మెల్యే కంచ‌ర్ల భూపాల్‌రెడ్డి మంగ‌ళ‌వారం రైతుల‌ను కోరారు. ప్ర‌భుత్వం సూచించిన క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ఇచ్చేందుకు నిరాక‌రించే ఇటువంటి వ్య‌క్తుల‌కు ధాన్యాన్ని అమ్మొద్ద‌న్నారు. జిల్లాలోని దండేప‌ల్లిలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే నేడు ప్రారంభించారు. అనంత‌రం మాట్లాడుతూ... రైతులు త‌మ ధాన్యాన్ని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన‌ ప్రాథ‌మిక వ్య‌వ‌సాయ స‌హ‌కార సంఘాలు, ఐకేపీ కేంద్రాల్లోనే అమ్ముకోవాల‌న్నారు. ప్ర‌భుత్వం అందించే క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌కంటే త‌క్కువ‌కు రైతులు ధాన్యాన్ని అమ్ముకోవ‌ద్ద‌న్నారు. వ్యవసాయరంగానికి గత వైభవాన్ని తీసుకువ‌చ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో రైతుల సహకారం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వల్ల గ్రామీణ ప్రజల ఆదాయ, జీవన ప్రమాణాలు గత ఆరు సంవత్సరాల్లో గణనీయంగా పెరిగాయ‌న్నారు.