సోమవారం 25 మే 2020
Telangana - Apr 02, 2020 , 22:42:47

ఈఎమ్‌ఐ మారటోరియం ఫోన్‌ కాల్స్‌కు స్పందించకండి...

ఈఎమ్‌ఐ మారటోరియం ఫోన్‌ కాల్స్‌కు స్పందించకండి...

హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో ఆర్‌బీఐ ఈఎమ్‌ఐ వాయిదాలపై మారటోరియం విధించడంతో దానిని ఆసరగా చేసుకుని సైబర్‌ క్రిమినల్స్‌ పంజా విసిరే అవకాశం ఉందని రాచకొండ పోలీసులు అనుమానిస్తున్నారు. దీని వారి ఎరకు అమాయకులు ఆర్థికంగా బలికాకుండా ఉండేందుకు రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు అప్రమత్తమయ్యారు.దీంట్లో భాగంగానే సైబర్‌ క్రిమినల్స్‌ వాయిదాలు నిర్ధారించుకోవాలనుకుంటున్నారా అయితే మీ ఖాతా వివరాలు, సీవీవీ నెంబరు, పిన్‌ నెంబర్లు,  అన్ని వివరాలు చెప్పితే మీకు ఈఎమ్‌ఐ మూడు నెలల పాటు వాయిదా పడుతుందని నమ్మించి వారికి క్యూఆర్‌ కోడ్‌, ఇతర యాప్‌లను డౌన్‌ లోడ్‌ చేయించి నగదును కొట్టేసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. 

దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు.సోషల్‌ మీడియా వేదికలతో పాటు మీడియా ద్వారా ప్ర చారం చేసేందుకు పోలీసులు ప్రణాళికను రూపొందించారు. ఆర్‌బీఐ, బాయంక్‌ అధికారులు ఎప్పుడు కూడా మీ వ్యక్తిగత బ్యాంక్‌ ఖాతాల వివరాలు అడగరని, ఈఎమ్‌ఐ వాయిదాల కోసం ఫోన్‌లో వివరాల అడగరని గుర్తించుకోవాలని సైబర్‌ క్రైం పోలీసులు సూచిస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా గందరగోళానికి గురికావద్దని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి అవగాహన కలిగిన వారు ఈఎమ్‌ఐ వాయిదాలపై బ్యాంక్‌ అధికారులు, ఆర్‌బీఐ అధికారులు ఫోన్‌లో వివరాలు అడగరని ఎవరీకి వారు కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులకు తెలియజేయాలని అధికారులు వివరిస్తున్నారు. లేదంటే కరోనా లాక్‌డౌన్‌లో సైబర్‌ క్రిమినల్స్‌కు దొరికి పోతామని తెలిపారు.logo