మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 14, 2020 , 02:51:56

రేడియోలో ఉర్దూ ప్రసారాలు తగ్గించొద్దు: ఎంపీ అసద్‌

రేడియోలో ఉర్దూ ప్రసారాలు తగ్గించొద్దు: ఎంపీ అసద్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆలిండియా రేడియోలో ఉర్దూ ప్రసారాలను 18 గంటల నుంచి 3 గంటలకు తగ్గించడంపై ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సోమవారం అసంతృప్తి వ్యక్తంచేశారు. మన దేశంతోపాటు పాకిస్థాన్‌ సరిహద్దు ప్రాంతాల్లోనూ వీటికి మంచి ఆదరణ ఉన్నదని తెలిపారు. భారత్‌పై పాక్‌ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడంలో ఉర్దూ ప్రసారాలు కీలకపాత్ర పోషించాయని చెప్పారు. పాక్‌ మరింత తీవ్ర ఆరోపణలు చేస్తున్న ప్రస్తుత సమయంలో ఉర్దూ ప్రసారాల సమయాన్ని కుదించడం వ్యూహాత్మక తప్పిదం అవుతుందని హెచ్చరించారు. ఈ అంశంపై పునరాలోచించాలని కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌కు ట్విట్టర్‌లో సూచించారు.logo