శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 24, 2020 , 01:27:49

కశ్మీర్‌ కోసం రాష్ట్రాల నిధులు తగ్గించొద్దు

కశ్మీర్‌ కోసం రాష్ట్రాల నిధులు తగ్గించొద్దు

  •  రాజ్యసభలో టీఆర్‌ఎస్‌ నేత కేశవరావు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జమ్ముకశ్మీర్‌ అభివృద్ధికి కేంద్ర నిధుల నుంచి కేటాయింపులు జరుపాలని, కానీ రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధుల వాటాను తగ్గించి జమ్ముకశ్మీర్‌కు ఇవ్వడం సరికాదని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అన్నారు. జమ్ముకశ్మీర్‌ ఆర్థిక బిల్లుపై సోమవారం రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. కశ్మీర్‌ అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ మద్దతు తెలుపుతుందన్నారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్రాలకు 42 శాతం నిధులను బదలాయించాల్సి ఉన్నదని, కానీ ఈ నిధులను కేంద్రం 41 శాతానికి తగ్గించడంతో తెలంగాణ సహా పలు రాష్ట్రాలు నష్టపోయే ప్రమాదమున్నదని కేశవరావు ఆవేదన వ్యక్తంచేశారు.logo