ప్రజల నమ్మకాన్ని నిలుపుకోవాలి: మంత్రి ఎర్రబెల్లి

హన్మకొండ: ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, డివిజన్ అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. మీర్‌పేట హౌసింగ్‌బోర్డ్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ ప్రభుదాస్ ఇవాళ హన్మకొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన గెలుపునకు సహరించినందుకుగాను మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేయాలని సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం డివిజన్‌ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. నిరుపేద మహిళలకు స్త్రీ నిధి లోన్లు వచ్చేలా కృషిచేస్తానని, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. ఈ గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్కు తిరుగులేదని జీహెచ్ఎంసీ ఎన్నికలతో మరోమారు నిరూపితమయ్యిందని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిందని వెల్లడించారు. టీఆర్ఎస్పై, పార్టీ అధినేత, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంపై ప్రజలు నమ్మకం ఉంచారని ప్రకటించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీర్‌పేట హౌసింగ్ బోర్డు డివిజన్ ఇన్చార్జిగా వ్యవహరించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
- విపణిలోకి స్పోర్టీ హోండా గ్రాజియా.. రూ.82,564 ఓన్లీ
- వెటర్నరీ వర్సిటీ వీసీగా రవీందర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ
- పది నిమిషాల్లోనే పాన్ కార్డు పొందండిలా..!
- ఎన్టీఆర్‌కు, చంద్రబాబుకు అసలు పోలిక ఉందా?: కొడాలి నాని
- ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
- వారం క్రితం కూలిన బంగారు గని.. సజీవంగానే కార్మికులు
- ఆధునిక టెక్నాలజీతోనే అధిక దిగుబడులు
- ఆటో బోల్తా..నలుగురికి గాయాలు..
- సురేందర్ రెడ్డికి పవన్ గ్రీన్ సిగ్నల్..!
- బెంగాల్లో మమతకు మద్దతిస్తాం: అఖిలేశ్