ఆదిపురుష్ సినిమా నుంచి సర్ ప్రైజ్ రాబోతోంది. ఇదేదో గాలివార్త కాదు. నిజంగా నిజమే. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. బుధవారం శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆదిపురుష్ నుంచి అప్ డేట్ ఉంటుందని చిత్రయూనిట్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఉదయం 7గంటల11నిమిషాలకు ఈ సర్ ప్రైజ్ ని రివీల్ చేస్తామని తెలిపింది.
ఆదిపురుష్ లో రాముడిగా ప్రభాస్ నటిస్తున్నాడు. సీతగా కృతిసనన్, లక్ష్మణుడిగా సన్నీసింగ్ , రావణుడిగా సైఫ్ నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా వచ్చే ఏడు ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.